- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడుతూ…. తెలంగాణ, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా బాగుండాలని ప్రార్థించానని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సిఎం కెసిఆర్ ని మరోసారి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు. నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నానని, తాజాగా కామాఖ్య దేవిని పునర్దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆధ్యాత్మికతలో భారతదేశం విరసిల్లుతూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన అస్సాంలో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం కలగడం సంతోషంగా ఉందని చెప్పారు.
- Advertisement -