Monday, December 23, 2024

చేర్యాల రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ రిలే దీక్షలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

చేర్యాల: చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. చేర్యాల కేంద్రంగా నాలుగు మండలాలను కలుపుకుని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి నిరసన కార్యక్రమాలు, వినతిపత్రాలను గ్రామ పంచాయతీ తీర్మానాల కాపీలను ప్రభుత్వానికి అందించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వ పెద్దలు వివక్షతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమన్నారు.

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది ఈ ప్రాంత అభివృద్ధి మాత్రమే కాదు చేర్యాల ప్రాంతం ఔన్నత్యం విశిష్టత, చేర్యాల ప్రాంత ప్రజల ఆత్మ గౌరవం ఇమిడి ఉన్నదనే అంశం ప్రభుత్వ పెద్దలు విస్మరించకూడదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాటారం, ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేట, తూప్రాన్ మండలాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి చేర్యాలను ప్రకటించకపోవడంలో అంతర్యం ఏమిటోనని ప్రశ్నించారు.

రెవెన్యూ డివిజన్ విషయంలో ప్రజలు రాజకీయ పరమైన నిర్ణయం తీసుకొకముందే విపక్షాలకు రాజకీయ అంశంగా మారకముందే ప్రభుత్వం చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు పలు పార్టీలతో పాటు బిఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు భీమ లక్ష్మణ్ మద్దతు తెలిపి రెవెన్యూ డివిజన్ అంశాన్ని మంత్రులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి, జేఏసీ నాయకులు ఆముదాల మల్లారెడ్డి, అందె అశోక్, కొమ్ము నర్సింగ రావు, దాసరి కళావతి, ఉడుముల భాస్కర్ రెడ్డి, సర్పంచ్ కుకట్ల బాల్ రాజ్ యాదవ్, ఆలేటి రజిత-యాదగిరి, ఎంపీటీసీ ఇర్రి రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ చెవిటి లింగం, మంచాల చిరంజీవులు, ఆవుశర్ల యదయ్య, కూరారం బాలనర్సయ్య, బస్వగల్ల సిద్దయ్య, బొమ్మగోని అంజయ్య గౌడ్, తడక లింగం, బుట్టి సత్యనారాయణ, బుట్టి బిక్షపతి, కొంగరి వెంకట మావో, మంజ మల్లేశం, రాగుల శ్రీనివాస్ రెడ్డి, బిజ్జ రాము, చంద శ్రీకాంత్, మిట్టపల్లి నారాయణరెడ్డి రాళ్ల బండి శశిధర్, దాసరి ప్రశాంత్, గూడెపు సుదర్శన్, బండి సుదర్శన్, రామడుగు బాలరాజ్, గూడ రాజిరెడ్డి, లకావత్ యాదగిరి, ఆముదాల రంజిత్ రెడ్డి, బండకింది అరుణ్ కుమార్, కొంగరి వెంకట స్వామి, చింతల విజయ్ కుమార్, బద్దిపడగ కృష్ణారెడ్డి, బోయిని మల్లేశం, పచ్చిమడ్ల వెంకటయ్య, మేడిపల్లి చందు, పోతుగంటి ప్రసాద్, కూరెళ్ల యాదగిరి, గొర్రె శ్రీనివాస్, కాశెట్టి ఉపేందర్, నర్ర కేశవులు, మల్లం ప్రదీప్‌కుమార్, ఎండి. కరీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News