- Advertisement -
అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి: సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు కోతుల బెడదను నివారించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశమైంది. కోతుల బెడద నివారించేందుకు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సోమవారం సచివాలయంలో కమిటీ సమావేశం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు. కోతుల బెడద నుంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇందుకోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను నిపుణుల కమిటీ సూచించింది.
- Advertisement -