Friday, December 20, 2024

చంద్రబాబు తప్పు ఒప్పుకొని రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న మంత్రి బొత్స

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి ముందు తన తప్పును ఒప్పుకొని.. రాజకీయాల నుంచి తప్పుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, చంద్రబాబు అరెస్టుపై టిడిపి నాయకులు చేస్తున్న రాద్ధాంతం దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు నిజంగా నిజాయితీ పరుడే అయితే కోర్టులో నిరూపించుకోవాలని సూచించారు. అలాగే రాజధానిలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగిందని, ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ఇన్ని అక్రమాలకు పాల్పడుతూనే యుగ పురుషుడిలా చంద్రబాబు బిల్డప్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం కేబినెట్ తీసుకున్న నిర్ణయమే అయినా ప్రభుత్వాధినేతకు బాధ్యత ఉండదా? అంటూ ప్రశ్నించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదని అన్నారు. అలాగే పశ్చాత్తాపం లేకుండా టిడిపి నేతలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. తమకు ఎవరిపై రాజకీయ కక్ష లేదని ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం అని ఆయన వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News