Monday, November 25, 2024

కిమ్ రష్యా పర్యటన నిజమే

- Advertisement -
- Advertisement -

నేడే పుతిన్‌తో చర్చలు? కీలక డీల్?
సియోల్ : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ త్వరలోనే రష్యా పర్యటనకు వెళ్లుతున్నారు. ఈ విషయాన్ని రష్యా, ఉత్తరకొరియాలు సోమవారంఅధికారికంగా నిర్థారించాయి. అత్యంత విలాసవంతమైన ప్రైవేటు రైలులో కిమ్ రష్యా ప్రయాణానికి సన్నాహాలు తలపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకాకి అవుతోన్న రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలవడంపై పశ్చిమ దేశాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉత్తరకొరియా అధ్యక్షులు కిమ్ సుదీర్ఘ చర్చలకు అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య చాలా పటిష్ట స్థాయి ఆయుధ ఒప్పందం కుదురుతుందని, ఇది ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని మరింత ఎగదోస్తుందని అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు విశ్లేషిస్తున్నాయి. పుతిన్ ఆహ్వానంపై కిమ్ రాబోయే కొద్దిరోజులలో మాస్కోకు వస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార వెబ్‌సైట్ ద్వారా సంక్షిప్త ప్రకటన వెలువడింది. దీనిని ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ కెసిఎన్‌ఎ కూడా అవునని నిర్థారించింది.

సరిహద్దులు దాటిన కిమ్ ట్రైన్?
ఏది చేసినా సంచలనం సృష్టించే ఉత్తర కొరియా అధినేత కిమ్ రష్యాకు ట్రైన్‌లో వెళ్లుతున్నట్లు వెల్లడైంది. తరచూ విదేశాలకు వెళ్లేందుకు కిమ్ వాడే ఆకుపచ్చ, పసుపుపచ్చ చారికల రైలు ఇప్పుడు ఉత్తర కొరియా రష్యా సరిహద్దుల వద్ద ఉందని అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులు తెలిపారు. కిమ్ తరచూ తన ప్రయాణాలకు దీనిలో వెళ్లుతుంటారు. అయితే తన ట్రిప్పులు ఇతరులకు అంతుచిక్కకుండా చూసుకునే కిమ్ ఇంతకూ ఈ రైలులో ఉన్నాడా? లేడా అనేది నిర్థారణ కాలేదు. ఈ రైలు సరిహద్దుల వద్ద అటూ ఇటూ చక్కర్లు కొడుతోందని , ఇంకా కీలకమైన స్టేషన్ దాటలేదని వార్తా సంస్థలు తెలిపాయి. అయితే ఇప్పటికే ఈ రైలు దాదాపుగా సరిహద్దులు దాటిందని, ఇందులో కిమ్ ఉన్నారని, పుతిన్ కిమ్ కీలక భేటీ మంగళవారం ఉంటుందని దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News