Monday, December 23, 2024

గ్రీన్‌ప్లై బ్రాండ్‌కు జూ.ఎన్‌టిఆర్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ ఇంటీరియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్ సున్నా ఉద్గారాల (జీరో ఎమిషన్: ఈ 0) ఉత్పత్తుల కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఆరోగ్యకరమైన ఇంటీరియర్‌ల కోసం పోరాడే హీరోగా జూనియర్ ఎన్టీఆర్ టెలివిజన్ కమర్షియల్(టివిసి)లో కనిపంచనున్నారు. కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ మనోజ్ తులసియన్ మాట్లాడుతూ, జూ.ఎన్‌టిఆర్ సహకారం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంస్థ జీరో ఎమిషన్ ఉత్పత్తి శ్రేణి నిబద్ధతకు ఇది నిదర్శనం అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు. గ్రీన్‌ప్లై 35కి పైగా నగరాల్లో అవుట్-ఆఫ్-హోమ్ (ఒఒహెచ్) చానెల్‌లు, వివిధ ఆన్-గ్రౌండ్ ఇనిషియేటివ్‌ల ద్వారా ప్రచారం చేస్తోంది. కంపెనీకి దేశవ్యాప్తంగా 2030 మార్కెట్ ఉందని చెప్పారు. ఆర్ అండ్ డి కోసం ఆదాయంలో 1 శాతం కేటాయిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, ఏపీలో విస్తరణ ప్రణాళిక ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News