బస్సులు నడుపుతూ ప్రయాణికులతో
ప్రయాణం
డీజిల్ అయిపోవడంతో మార్గమధ్యలో
వదిలి వెళ్ళిన వైనం..
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టిసి అద్దె బస్సును ఓ ఆగంతకుడు దొంగలించిన సోమవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బస్సు ఓనర్ స్వామి తెలిపిన వివరాల ప్రకా రం తన సొంత బస్సును గత కొంతకాలంగా సిద్దిపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సును నడుపుతున్నా రు. రోజువారి మాదిరిగానే ట్రిప్పులు ముగియడం తో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బస్సును సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పార్కు చేసి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు వచ్చి చూసేసరికి అక్కడ బస్సు కనిపించలేదు. అసలు బస్సు ఎక్కడ వెళ్లిందని ఆరా తీస్తున్న సమయంలో సిరిసిల్లకు చెందిన ఆర్టీసీ సిబ్బంది బస్సు ఓనర్‌కు ఫోన్ చేసి మీ బస్సు జిల్లెల్ల క్రాసింగ్ వద్ద ఉందని చెప్పగా ఓనర్ అక్కడికి వెళ్లి వివరాలు ఆరా తీశారు.
Also Read: హైదరాబాద్ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….
తనకు ఆశ్చర్యకరమై న విషయాలు తెలిసినట్లు ఓనర్ తెలిపారు. దొంగలించడానికి ప్రయత్నించిన వ్యక్తి బస్సును ఎటో తీసుకొని వెళ్లకుండా సిద్దిపేట నుండి వేములవాడ బస్టా ండులో బస్సు నిలిపి అక్కడ ప్రయాణికులను ఎక్కి ంచుకొని సిరిసిల్ల బస్ స్టాప్‌లో డ్రాప్ చేసి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని సిద్ధిపేటకు వస్తుండగా మార్గమధ్యమంలో డీజిల్ అయిపోవడంతో బస్సును వదిలిపోయినట్లు తెలిసిందని ఓనర్ తెలిపారు. బస్సును దొంగలించిన వ్యక్తి తెలియని చోటుకు తీసుకువెళ్లకుండా బస్టాండ్‌లో పెట్టి ప్ర యాణికులను ఎక్కించుకొని ఎందుకు ట్రిప్పులను నడిపినట్లు అర్థం కావడం లేదని అసలు ఇది ఎలా జరిగిందో పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి న్యా యం జరిపించాలని బస్సు ఓనర్ స్వామి కోరారు.