Saturday, December 21, 2024

చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదు: పంచుమర్తి అనురాధ

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాణాలకు రక్షణ లేదని టిడిపి నేత పంచుమర్తి అనురాధ అనుమానం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.  సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెబుతున్నది అక్షర సత్యమని, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీ వార్తలు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంఘటనలు పబ్లిక్‌లోనే జరుగుతున్నాయని, తెలంగాణలో పోలీసుల ఉదాసీన వైఖరి ఎన్నో సార్లు ప్రత్యక్షంగా చూశామని, అమరావతి పర్యటనలో చంద్రబాబు బస్సుపై వైసిపి మూకలు రాళ్లదాడి చేశాయని, నందిగామ, యర్రగొండపాలెం పర్యటనలో రాళ్ల దాడిలో ఇద్దరు ఎన్‌ఎసిజి కమాండోలాల తలకు గాయమైన విషయాన్ని పంచుమర్తి గుర్తు చేశారు. అంగళ్లు వద్ద రాళ్ల దాడి జరిగితే బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని పంచుమర్తి మండిపడ్డారు.

Also Read: హైదరాబాద్‌ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News