Friday, January 10, 2025

ప్రభుత్వ తప్పిదాలను ఛార్జిషీట్ రూపంలో ప్రకటిస్తాం: భట్టీ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ ఆత్మగౌరం లేదని కాంగ్రెస్ సిఎల్పి నేత మల్లు భట్టీ విక్రమార్క అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి భట్టీ విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్ర సంపద, వనరులు కొందరి చేతుల్లోనే ఉన్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పు చేసింది.  ఈనెల 17న జరిగే కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి. ఈనెల 18న అన్ని నియోజకవర్గాల్లో సిడబ్ల్యూసీ సభ్యులు పర్యటిస్తారు. ప్రతి 5 నియోజకవర్గాలకు ఒక సీనియర్ నాయకుడిని బాధ్యుడిగా నియమించాం. బిఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ఛార్జిషీట్ రూపంలో ప్రకటిస్తాం. ఐదు హామీల గ్యారంటీ కార్డును అందరికీ అందిస్తాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News