Monday, January 20, 2025

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారు రాజీవ్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News