Monday, November 25, 2024

బయోడీజిల్‌లో రూ.2000 కోట్ల పెట్టుబడులు: బిఎఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో దేశంలో సగటున రూ.2000 కోట్ల పెట్టుబడితో 100కు పైగా కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బిఎఐ) వైస్ ప్రెసిడెంట్ ధరమ్ వీర్ సింగ్ రాజ్ పురోహిత్ తెలిపారు. వచ్చే 2070లో నికర జీరో విజన్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎకానమీకి నిరంతరం ప్రాధాన్యమిస్తోందని, దీని వల్ల వాయు కాలుష్య నివారణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, దీని వల్ల దేశవ్యాప్తంగా జీవ ఇంధనాలకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు.

గ్లోబల్ ఎనర్జీలో భాగంగా సుస్థిర ఇంధనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో జరుగుతున్న జి-20 సదస్సులో గ్లోబల్ అలయన్స్ ఆన్ బయోఫ్యూయెల్స్ కోసం భారత్ ప్రతిపాదించింది. బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయగా అధ్యక్షుడిగా ఎస్ కే మొండల్, ఉపాధ్యక్షుడిగా ధరమ్ వీర్ సింగ్ రాజ్ పురోహిత్, విపి, కోశాధికారిగా కె.చేరన్, కార్యదర్శిగా దీపిన్ షా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News