న్యూయార్క్: తన సహచర ఉద్యోగి దురుసుగా కారు నడిపి ఒక భారతీయ విద్యార్థిని మరణానికి కారణమైన ఘటనపై సరదాగా జోకులు వేస్తూ భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదంటూ ఎద్దేవా చేసిన అమెరికాలోని సీటెల్ పోలీసు శాఖకు చెందిన ఒక పోలీసు అధికారికి సంబంధించిన వీడియోపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 23 సంత్సరాల కందుల జాహ్నవి సౌత్ లేక్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 23న థామస్ స్ట్రీస్‌లోని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ సమీపంలో రోడ్డుపై నడుస్తుండగా కెవిన్ డేవ్ అనే సీటెల్‌కు చెందిన పోలీసు అధికారి నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరనించారు.
సీటెల్ పోలీసు అధికారుల గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ దానియల్ ఆడెరెర్ కారు నడుపుతూ చేసిన సంభాషణ తాలూకు వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. గిల్డ్ అధ్యక్షుడు మైక్ సోలన్‌తో ఫోన్‌లో ఆడరర్ మాట్లాడుతూ ఆమె(జాహ్నవి) విలువ చాలా తక్కువ అంటూ ఆమె ప్రాణానికి విలేవే లేదన్నట్లుగా మాట్లాడడం ఆ వీడియోలో కనిపించింది. ఆమె చనిపోయింది అంటూ గట్టిగా నవ్వడమే గాక ఇదంతా మామూలే అంటూభారతీయ విద్యార్థిని మరణాన్ని చాలా తేలికగా తీసిపారేశాడు.
11,000 డాలర్లకు చెక్ రాస్తే చాలు..ఆమెకు 26 ఏళ్లు. ఆమెకు విలువ చాలా తక్కువ అంటూ ఆడరర్ చేసిన వ్యాఖ్యలు భారతీయ విద్యార్థిని పట్ల ఒక అమెరికన్ పోలీసుకు ఉన్న చిన్న చూపు ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. కారును డేవ్ గంటకు 50 మైళ్ల వేగంతో నడుపుతున్నాడని, ఒక శిక్షణ పొందిన డ్రైవర్‌కు అది చాలా తక్కువ వేగమని కూడా ఆడరర్ సర్టిఫై చేశాడు.
అయితే జాహ్నవి మరణంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో డేవ్ గంటకు 74 మైళ్ల వేగంతో కారు నడిపినట్లు తేలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గంలకు 25 మైళ్లకు మించి వేగంగా వాహనాలు నడపడానికి వీల్లేదు. డేవ్ వేగంగా నడిపిన కారు ఢీకొని జాహ్నవి 100 అడుగుల మేర దూరంలో ఎగిరిపడింది.
ఆడరర్ ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియోపై దర్యాప్తు చేపట్టినట్లు సీటెల్ పోలీసు శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా..ఈ వీడియో సంభాషణపై జాహ్నవి బంధువు, టెక్సాస్ నివాసి అశోక్ కందుల స్పందిస్తూ ఈ పోలీసు అధికారుల కుమార్తెలు, మనవరాళ్ల ప్రాణాలకు మాత్రం విలువ ఉంటుందా అని ప్రశ్నించారు. ఎవరి ప్రాణమైనా ప్రాణమేనని ఆయన అన్నారు.