Monday, December 23, 2024

గేదెల దొంగతనం కేసులో 58 ఏళ్ల తరువాత నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రెండు గేదెలు, ఒక దూడను దొంగతనం చేసిన కేసులో నిందితుడిని 58 సంవత్సరాల తరువాత పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని ఉదగిర్ ప్రాంతంలో మురళీధర్ మాణిక్ రావు కులకర్ణి అనే రైతుకు సంబంధించి రెండు గేదేలు, ఒక దూడ కనిపించకపోవడంతో మేకర్ పోలీస్ స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. 1965 ఏప్రిల్ 25న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read: చన్నీళ్లతోనే బాబు స్నానం

గణపతి విటల్ వగోర్, కిషణ్ చందర్ అనే వ్యక్తులు గేదేలను దొంగతనం చేశారని విచారణలో తేలడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గణపతి బెయిల్‌పై విడుదలైన తరువాత పోలీసుకు కనిపించకుండా పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను బయటకు తీయగా ఈ కేసును ఎసిప్ ఎస్‌ఎల్ చిన్నబసవణ్ణ గుర్తించి స్పెషల్ టీమ్‌ను నిందితులను పట్టుకోవడానికి నియమించాడు. 58 సంవత్సరాల తరువాత నిందితుడు గణపతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కిషన్ చందర్ అనే నిందితుడు 2006లో చనిపోయాడు. గణపతికి 20 ఏళ్ల ఉన్నప్పుడు దొంగతనం చేసి బెయిల్ విడుదలై తప్పించుకున్నాడు. 78 ఏళ్ల వయసులో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News