అయోధ్య(యుపి): అయోధ్యలోని రామజన్మభూమి స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్న సందర్భంగా ప్రాచీన ఆలయానికి సంబంధించిన శిథిలాలు లభించినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.
రాజన్మభూమి స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా లభించిన ప్రాచీన ఆలయానికి చెందిన స్తంభాలు, విగ్రహాలను ఆయన బుధవారం ఎక్స్(పూర్వ ట్విట్టర్)లో షేర్ చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులను తీర్ఘ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షిస్తోంది.
రామజన్మభూమి స్థలంలో తవ్వకాల సందర్భంగా ప్రాచీన ఆలయానికి సంబంధించిన శిథిలాలు లభించాయి. వాటిలో అనేక స్తంభాలు, విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రాచీన ఆలయానికి చెందిన శిథిలాలేనని స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం రామాలయానికి చెందిన మొదటి అంతస్తు నిర్మాణం పూర్తికావస్తోంది అని ఎక్స్‌లో రాయ్ తెలిపారు.
श्री रामजन्मभूमि पर खुदाई में मिले प्राचीन मंदिर के अवशेष। इसमें अनेकों मूर्तियाँ और स्तंभ शामिल हैं। pic.twitter.com/eCBPOtqE1W
— Champat Rai (@ChampatRaiVHP) September 12, 2023