Saturday, December 21, 2024

ఇది జీరో పొల్యూషన్ ప్లాంట్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మోనిన్ పరిశ్రమకి మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోనే మొదటి యూనిట్‌ని మోనిస్ సంస్థ సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తుందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగం కల్పించడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుందని, ఇది జీరో పొల్యూషన్ ప్లాంట్ అని ప్రశంసించారు. 18 నెలల్లో ప్లాంట్ నిర్మాణాలు పూర్తి అవుతాయని, కొంత మంది రాజకీయాలు చేస్తారని, నిజనిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు.

Also Read: గేదె చోరీ కేసు: 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

మన మీద నమ్మకంతో పెట్టుబడి పెడుతున్న వారికి అన్ని రకాలుగా సహకరించాలని కోరారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ మారిందన్నారు. భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయన్నారు. రూ.300 కోట్లకు పైగా పెట్టుబడితో 40 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని కెటిఆర్ వెల్లడించారు. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని, అన్ని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని, పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకవచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News