Friday, November 15, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారారు. లిక్కర్ స్కాంలోని ఇడి కేసులో ఆయన అప్రూవర్‌గా మారినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈ కేసులో రామచంద్రపిళ్లై ఆస్తులను ఇడి అటాట్ చేసింది. అంతేకాదు ఇడి, సిబిఐ కేసులోనూ ఆయన నిందితుడిగా వున్నాడు. ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఇదే స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్‌గా మారిన సంగతి విదితమే. ఈ కేసులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారడంతో ఆయన నుంచి ఇడి కీలక విషయాలు రాబట్టినట్లుగా సమాచారం. అయితే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువమంది సౌత్ గ్రూప్‌నకు చెందిన వారే కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News