న్యూఢిల్లీ : ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను కేం ద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అ జెండా ఏమిటనేది తెలియకుండా సెషన్ ఏర్పాటు తేదీలను ప్రకటించడం, ముందు గా తెలియచేయకపోవడం ఏమిటనే ప్రశ్న లు తలెత్తాయి. దీనిపై ఉత్కంఠ నెలకొన్న ద శలో దీనిని తొలిగిస్తూ బుధవారం పార్లమెంట్ స్పెషల్ సెషన్ అజెండాను వెలువరించారు. పార్లమెంట్ 75 సంవత్సరాల చరిత్ర పై చర్చ జరుగుతుందని, నాలుగు కీలకమైన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రధాన ఎలక్షన్ కమిషనర్ నియామక ప్రక్రియ సంబంధించిన బిల్లు కూడా ఇందులో ఉంది. లోక్‌సభ సచివాలయం నుంచి బులెటిన్ వెలువరించారు. పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అధ్యయనాల పేరిట చర్చ ఉంటుంద ని అధికార ప్రకటనలో తెలిపారు.
ఇక బిల్లులకు సంబంధించి సిఇసి , ఇతర ఎలక్షన్ కమిషనర్ల ( నియామకం, సేవలు, పదవీ కాలపరిమితి నిబంధనల) బిల్లు, పోస్టాఫీసు బిల్లు, అడ్వకేట్స్ (సవరణ)బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు (ఆర్‌ఎన్‌ఐ) ) ఆమోద ప్రక్రియ ఉంటుందని ప్రకటనలో తెలిపారు. జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పిడి, ఉమ్మడి పౌరస్మృతి వంటి విషయాలను కేంద్రం తీసుకువస్తుందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై గందరగోళం నెలకొంది. దీనికి తెరతీస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలోనే ప్రత్యేక సెషన్ అజెండా ఉంటుందని కేంద్రం ఇప్పుడు పరోక్షంగా వివరణాత్మక ప్రకటన వెలువరించింది. కాగా, 17వ తేదీ మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం అన్ని పార్టీల సభాపక్ష నేతల సమావేశం నిర్వహించనున్నది.