Monday, December 23, 2024

పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉరేసుకున్న మహిళా కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

పాట్నా: మహిళా కానిస్టేబుల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉరేసుకున్న సంఘటన బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గయా జిల్లాలోని మండేయ్ గ్రామానికి చెందిన అర్చన కుమారీ అనే మహిళా కానిస్టేబుల్ సమస్తిపూర్ కంట్రోల్ రూమ్‌లో పని చేస్తున్నారు. ఆమె భర్త సుమన్ కుమార్ కూడా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సుమన్ విధుల నిర్వహణలో భాగంగా సస్పెండ్ కావడంతో అర్చన మనోవేదనకు గురయ్యారు. బుధవారం సాయంత్రం షిప్ట్‌లో ఆమె విధులు నిర్వహిస్తుండగా తన భర్తకు సూసైడ్ నోట్ పంపించింది. వెంటనే భర్త అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆమె ఉరేసుకుంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. సమస్తిపూర్ డిఎస్‌పి సంజయ్ పాండే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: దామరచర్లలో రెప్పపాటులో రూ.5 లక్షలు కొట్టేసిన దొంగలు…. వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News