Friday, December 20, 2024

బిజెపితో పవన్ పెళ్లి… టిడిపితో కాపురం: వెల్లంపల్లి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రుడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుజువు చేశారని వైసిపి ఎంఎల్ఎ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. దత్త తండ్రి అరెస్ట్‌ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు వాటా ఉందని వెల్లంపల్లి ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు అని, పవన్ బిజెపిని పెళ్లి చేసుకొని టిడిపితో కాపురం చేస్తున్నారని వెల్లంపల్లి చురకలంటించారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీ పెట్టారని, చంద్రబాబును పవన్ నమ్ముకున్నారని, తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు.

Also Read: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది: రాంబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News