Friday, December 20, 2024

రన్‌వే నుంచి జారి ముక్కలయిన విమానం..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంనుంచి ముంబయికి బయల్దేరిన విఎల్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు (లియర్‌జెట్45) విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌వేపైనుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ సంఘటనలో విమానం రెండు ముక్కలు కాగా, .. ఎనిమిది మందికీ గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

అయితే గాయాల తీవ్రత గురించిమాత్రం వెల్లడించలేదు. ముంబయిలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రమాదం జరిగిన సమయంలో విజిబిలిటీ 700 మీటర్లు మాత్రమే ఉందని డిజిసిఎ వర్గాలు తెలియజేశాయి. రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రన్‌వేను కొద్ది సేపు మూసివేశారు.ఆ సమయంలో విమానాశ్రయంలో దిగాల్సిన అయిదు విమానాలను వేరే ప్రాంతాలకు తరలించినట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. సహాయక చర్యల అనంతరం డిజిసిఎ, ఎటిసి అనుమతితో రన్‌వేపై కార్యకలాపాలను పునరుద్ధరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News