Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(15-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

వృషభం: కళా,సాంస్కృతిక రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుండో కాని పనులు సానుకూల పడతాయి.ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు.

మిథునం: సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్వల్ప ధన లాభాలు ఉంటాయి. ఆప్తులతో కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండండి.

కర్కాటకం: షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన వస్తూ, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. నూతన పెట్టుబడులు ఒప్పందాలు కుదురుతాయి.అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సహోదర వర్గంతో వివాదాలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి.

కన్య: శ్రమ అధికంగా ఉంటుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.విలువైన వస్తువులు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి.

తుల: వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు,స్థలాలు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగ,వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థికపరంగా అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం: భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు.సేవా కార్యక్రమాల చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. వస్తు లాభాలు అందుతాయి. ఆర్థిక అభివృద్ధి అంచలంచెలుగా పెరుగుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది.

ధనస్సు: నూతన వస్తువులు,వస్త్రాలు గొనుగోలు చేస్తారు.క్రయవిక్రయాలలో లాభం అర్జిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.ఆపదలో ఉన్న ఒకరిని సకాలంలో ఆదుకుంటారు.మంచి ప్రవర్తన మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది.

మకరం: చేపట్టిన పనులలో జాప్యం జరిగిన నిదానంగా విజయవంతంగా పూర్తి చేస్తారు, దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.సోదరుల నుండి ధన లాభాలు. దైవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అనుకోని అతిధి రావడం ఆనందం కలిగిస్తుంది.

కుంభం: చిన్ననాటి మిత్రుల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ,కళా పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు పొందుతారు.ఆర్థికపరంగా సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మీనం: శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.అనుకోని అతిధుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.ఉద్యోగస్తులకు పదోన్నతులు ప్రాప్తిస్తాయి.

Saturday rasi phalalu

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News