Thursday, December 19, 2024

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కేవిపల్లి మండలం మఠంపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం, లారీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని దవాఖానాకు తరలించారు.

ఇక, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టం మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను కర్ణాటకలోని బెళగావి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News