Saturday, November 23, 2024

హై సెక్యూరిటీ జోన్‌లోకి తాజ్‌కృష్ణ , తాజ్ బంజారా, తాజ్ డెక్కన్ హోటళ్లు

- Advertisement -
- Advertisement -

నేడు మధ్యాహ్నం నుంచి సిడబ్య్లూసి సమావేశాలు ప్రారంభం !

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్య్లూసి) సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ లాంటి జడ్ ప్లస్ కేటగిరీ నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో హోటల్, దాని పరిసరాలను కేంద్ర బలగాలు నియంత్రణలోకి తీసుకున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాలు సైతం ఇదే హోటల్లో నేడు (శనివారం) మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పూర్తిస్థాయి సీడబ్ల్యూసీ సమావేశాలు రాత్రి వరకు జరుగనున్నాయి. 17వ తేదీ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణ అంశాలే కేంద్రంగా విస్తృతస్థాయి ఈ సమావేశాలు జరుగనున్నాయి. సాయంత్రానికి తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు నేతలంతా బయలుదేరి వెళ్లనున్నారు.
నేడు ఉదయం రాహుల్, సోనియా, ప్రియాంకల రాక
అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది ఆహ్వానితులు వస్తున్నందున తాజ్ కృష్ణతో పాటు తాజ్ బంజారా, తాజ్ డెక్కన్, మరికొన్ని హోటళ్లను కూడా పిసిసి బుక్ చేసుకుంది. ఇక్కడ కూడా పలువురు కీలక నేతలు బస చేస్తుండడంతో ఇవి కూడా హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లిపోయాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ రెండు రోజుల పాటు ఇక్కడే బస చేస్తుండడంతో భద్రతా చర్యలను కేంద్ర, రాష్ట్ర పోలీసులు బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేడు ఉదయం ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు హైదరాబాద్‌కు చేరుకుంటారని పిసిసి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News