Thursday, December 19, 2024

శనివారం రాశి ఫలాలు(16-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరము. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలో సఖ్యత నెలకుంటుంది. ఆనందంగా గడుపుతారు.

వృషభం: కొత్త మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అదనపు భాధ్యతలు పెరుగుతాయి. భద్రత ముఖ్యం.

మిథునం: మిత్రుల నుండి వ్యాపార పరమైన కీలక సమాచారం అందుకుంటారు.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు,ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. సంతానం నూతన విద్య. ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా రాబడి ఉంటుంది.

సింహం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. కుటుంబ సబ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతాయి.

కన్య: నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇన్నాళ్ళు పడిన శ్రమ ఫలిస్తుంది. దూరప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలవుతాయి.ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు అవసరం.

తుల: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.చేపట్టిన పనులు సన్నిహితుల సహాయసహకారాలతో ముడిపడని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వారి ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

వృశ్చికం: ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యంపట్ల మెలకువ చాలా అవసరము.మిత్రులతో ఏర్పడిన వివాదాలు కొరకరాని కొయ్యిలా తయారవుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి.ఆస్తి వివాదాలు తీరుతాయి.నూతన ఒప్పందాలు కుదురుతాయి.పెద్దల మాటలు పెడచెవిన పెట్టవద్దు.

మకరం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనయోగం గోచరిస్తున్నది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వాటిని సకాలంలో ఏ విధంగా పూర్తి చేయాలని తలమునకలు అవుతారు.

కుంభం: కుటుంబ సభ్యులను,చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.విలువైన వస్తువులు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎదుటి వారు ఎలాంటి వారో గ్రహించి వారితో స్నేహం చేయడం ముఖ్యం.

మీనం: జీవిత భాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలు కార్యచరణకు నాంది పలుకుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు అర్జిస్తారు. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు.ఇతరుల ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది.

Saturday rasi phalalu

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News