Friday, December 20, 2024

భార్యపై భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు….

- Advertisement -
- Advertisement -

రాంఛీ: మద్యం మత్తులో భార్యపై భర్త కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సురహిబాగ్ గ్రామంలో కుల్దీప్ కుమార్ డంగి అనే వ్యక్తి తన భార్య, తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కుల్దీప్ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసగా మారాడు. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కిరోసిన్ తీసి ఆమెను భర్త తగలబెట్టాడు. భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కోడలిని రక్షించేందుకు ప్రయత్నం చేసి అత్త తీవ్రంగా గాయపడడడంతో రాంఛీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె 80 శాతం గాయపడడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: విదేశాలకు పారిపోయిన చంద్రబాబు పిఎస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News