అమరావతి: పేద మహిళలకు ఆర్థిక స్వాలంబన అందించే పథక కాపు నేస్తం అని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కాపు నేస్తం నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. నాలుగో ఏడాది కాపు నేస్తం నిధులను విడుదల చేశారు. 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం చేశారు. నాలుగేళ్లలో కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2029 కోట్లు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగ జగన్ మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయమే నినాదంగా ముందుకెళ్తున్నామని, ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చామని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపులు డిప్యూటీ సిఎంలుగా ఉన్నారని, నామినేటెడ్ పోస్టుల్లో 12 శాతం కాపు వర్గానికే ఇచ్చామని జగన్ తెలియజేశారు. 2.46 లక్షల మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. కాపులకు డిబిటి, నాన్‌డిబిటి ద్వారా రూ.39247 కోట్లు అందించామని, 2.06 లక్షల ఉద్యోగాల్లో 9.06 కాపు వర్గానికే కేటాయించామన్నారు.
3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం: జగన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -