Monday, December 23, 2024

‘హాయ్ నాన్న’ ఫస్ట్ సింగిల్ సమయమా పాట విడుదల

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్నా’ మేకర్స్ నిన్న ఫస్ట్ సింగిల్ సమయమా ప్రోమోతో అలరించారు. ఈ రోజు, ఇష్టమైన వారందరికీ కోసం పాడుకునే పాటగా ఉండబోతున్న లిరికల్ వీడియోను విడుదల చేశారు. సమయమా మనసుని ఆకట్టుకునే మోడ్రన్ టచ్ వున్న బ్యూటీఫుల్ సాంగ్. అనంత శ్రీరామ్ లిరిక్స్ తన ఎక్సయిట్మెంట్ ని ఆపుకోలేని హీరో కథని చెబుతూ, తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. ఆర్కెస్ట్రేషన్, బేస్ ట్రాక్ గిటార్ బీట్స్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి. ట్యూన్, ప్రొగ్రషన్ కట్టిపడేస్తున్నాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. నాని, మృణాల్ ఠాకూర్ అద్భుతమైన కెమిస్ట్రీతో విజువల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానిన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ‘హాయ్ నాన్న’ ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News