- Advertisement -
న్యూయార్క్ : గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ తన భార్య నికోలే షనహన్కు విడాకులు ఇచ్చారు.లాయర్‌గా, యువ పారిశ్రామికవేత్తగా ఉన్న నికోలే ప్రపంచ బిలియనీరు ఎలన్ మస్క్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియచేస్తూ విడాకులు ఖరారు చేసుకున్నాడు. చాలా రోజుల క్రితమే విడాకులు నిర్థారణ అయ్యాయి. వీరి నాలుగేళ్ల కూతురు పోషణకు సంబంధించిన ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు ఖరారు కావడంతో విడాకుల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా తనకు ఆమెకు సంబంధం ఉందనే వాదనను మస్క్ తోసిపుచ్చారు. పలుసార్లు విందులలో ఎందరో కలుస్తుంటారు. ఒకటి రెండుసార్లు ఆమెతో మాట్లాడి ఉంటానని, దీనికి వేరే విషయాలను ఆపాదిస్తారా? దీని వెనుక రోమాన్స్ వెతకడం హాస్యాస్పదం అని ఆయన తమ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
- Advertisement -