Monday, December 23, 2024

మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కొంతకాలంగా బిఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరారు. తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి సాదారంగా స్వాగతం పలికారు. తుమ్మల చేరిక కార్యక్రమంలో కర్ణాటక సిఎం సిద్దరామయ్య, కెసి వేణుగోపాల్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

అయితే తుమ్మల కాంగ్రెస్ చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారుతున్నాయి. తుమ్మలతో పాటే ఆయన అనుచరులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు కూడా కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఆయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News