Sunday, December 22, 2024

50 రూపాయల కోసం కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె మండలం కొత్తపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. 50 రూపాయల కోసం కత్తితో దాడి జరిగింది. ముస్తఫా (40) ఇదే ప్రాంతంలోని నాగరాజుకు కొన్ని రోజుల క్రితం రూ.50 అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు తనకు అవసరం ఉందని ఇవ్వాలని అడగడంతో నాగరాజు ఆగ్రహంతో కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ అతడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవేశంలోనే ఈ దాడికి పాల్పడినట్లు నిందితుడు పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News