Monday, December 23, 2024

మద్యం మత్తులో రెండేళ్ల కూతురిని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః మద్యం మత్తులో కన్నకూతురినే హత్య చేసిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటు చేసుకుంది. ఆదివారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీధర్‌రెడ్డితో కలిసి డిఎస్‌పి రమేష్ కుమార్ మాట్లాడుతూ.. నర్సాపూర్ మండంలోని ఎర్రకుంట తాండాకు చెందిన సురేష్ తన భార్య వనిత, 2 ఏళ్ల కూతురు నందినితో కలిసి సంగారెడ్డిలోని కిందిబజార్‌లో అద్దెకు ఉంటున్నాడన్నారు. ఈ నెల 14న సాయంత్రం 6గంటల సమయంలో సురేష్ తన భార్య పనిచేసే వైన్స్ వద్దకు వెళ్లి భార్య దగ్గర వంద రుపాయలు తీసుకొని అక్కడే వైన్స్‌లో ఒక మద్యం బాటిల్ కొనుగోలు చేసి తన కూతురు నందిని తన వెంట ఇంటికి తీసుకువెళ్లాడన్నారు.

పని ముగించుకొని రాత్రి 10గంటలకు ఇంటికి వెళ్లిన వనిత తన కూతురు నందిని ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనించి తన భర్తను పాపకు ఏమైందని అడగ్గా చనిపోయిందని చెప్పడంతో స్థానికుల సహాయంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ పరిశీలించిన డాక్టర్‌లు పాప మృతి చెందిందని తెలిపారన్నారు. మృతురాలి తల్లి వనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం అద్దెకు ఉంటున్న రూం వద్ద వనిత భర్తను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. నిందితుడు సురేష ఇంట్లో మద్యం తాగుతుండగా తన కూతురు ఎడుస్తుండడంతో ఎంత ఓదార్చిన ఏడ్పు ఆపలేక పోవడంతో ఆగ్రహం చెంది మద్యం మత్తులో తన కూతురును ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందని డిఎస్‌పి వెల్లడించారు. ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డిఎస్‌పి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News