Monday, November 25, 2024

రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో అవగాహన ఉండాలి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల గురించి తెలుసుకోవాలి

మనతెలంగాణ/హైదరాబాద్: రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో అవగాహన ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల గురించి తెలిసి ఉండాలని, తెలంగాణలో కేవలం బిఆర్‌ఎస్‌తో మాత్రమే కాంగ్రెస్ పోరాడటం లేదని, బిజెపి, మజ్లిస్ పార్టీలతో కూడా పోరాడుతున్నామని ఆయన అన్నారు. తాము వేర్వేరు పార్టీలని బిఆర్‌ఎస్, బిజెపి, మజ్లిస్ చెప్పుకుంటాయని, ఈ మూడు పార్టీలు కలిసే ఉంటాయని ఆయన ఆరోపించారు.

రైతు బిల్లులతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ పార్టీ బిజెపికి మద్దతిచ్చిందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రజలకు గ్యారంటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరు గ్యారెంటీలను ఇస్తోందని, వాటిని అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News