Friday, January 3, 2025

గెలిస్తే హెచ్ 1 బి వీసా పద్ధతి ఎత్తివేత: వివేక్ రామస్వామి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఇప్పుడున్న లాటరీ ప్రాతిపదిక హెచ్ 1 బి వీసా పద్ధతిని పూర్తిగా ఎత్తివేస్తానని రిపబ్లికన్ అభ్యర్థిగా రేసులో ఉన్న ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. ఇది ఒక అర్థంపర్థం లేని ఉద్యోగ కాంట్రాక్టు పద్థతి అని స్పందించారు. ఇప్పటి లాటరీ ప్రాతిపదిక వీసాల విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. దీనికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాల మంజూరీకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇప్పుడున్న వీసాల కార్యక్రమం అంతటిని ప్రక్షాళించాల్సి ఉందన్నారు. ఇప్పటి హెచ్ 1 బి వీసా పద్థతి కేవలం ఆయా కంపెనీలకే లాభసాటిగా నిలుస్తోందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న వివేక్ ప్రచార దశల్లో పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ రేస్‌లో బలీయ గుర్రంగా నిలిచారు. వచ్చే ఏడాది అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయి. భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన కార్యాచరణ ప్రకటనతో భారతీయ ఐటి ప్రొఫెషనల్స్ గుండెల్లో ప్లేను పరుగెత్తించారు.అమెరికాలో ఉద్యోగాలకు ఇండియన్ ఐటి యువత ఎక్కువగా ఈ తాత్కాలిక వీసా ఉద్యోగ విధానం హెచ్ 1 బి వీసాపైనే ఆధారపడుతున్నారు.

ప్రత్యేకించి భారతీయ ఐటి యువతనే అమెరికా కంపెనీలు ఎక్కువగా ఈ వీసా ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. తాను ఈ వీసాను 29 పర్యాయాలు వాడుకున్నానని వివరించారు. కాగా రామస్వామికి చెందిన పూర్వపు కంపెనీ రోవియంట్ సైన్సెస్ 2018 నుంచి 2023 వరకూ ఈ హెచ్ 1 బి వీసా కిందనే 29 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. అయితే సంబంధిత ప్రక్రియను వాడుకోవడం , దీనిని వాడుకున్న వారందు పాటిస్తున్న చెడు విధానమే అవుతుందని ఈ 38 సంవత్సరాల బయోటెక్ పారిశ్రామికవేత్త తెలిపారు. ఇంతకు ముందు జరిగిన ప్రచార ఘట్టం దశలో వివేక్ రామస్వామి తాను అధికారంలోకి వస్తే 75 శాతం ప్రభుత్వోద్యోగాలపై వేటేస్తానని, ఎఫ్‌బిఐవంటి పలు సంస్థలను రద్దు చేస్తానని చెప్పారు. ఇప్పుడున్న లాటరీ వీసా పద్ధతి తొలిగిపోవాలనేదే తన ఆలోచన అని తెలిపిన ప్రతిభను లెక్కలోకి తీసుకునే ఇతరదేశాల ఐటి ఉద్యోగులను అమెరికాకు అనుమతించాల్సి ఉందన్నారు. గొలుసు కట్టు వలసలను అరికట్టాలనేదే తమ విధానం అని తెలిపారు. హెచ్ 1 బి వీసాల పద్ధతిపై మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యతిరేకతను చాటుకున్నారు. ఈ ప్రాతిపదికన వీసా మంజూరీని గణనీయంగా తగ్గించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News