Friday, November 22, 2024

వైద్యులకు నాన్ టెక్నికల్ స్కిల్స్ కోర్సులు అవసరం

- Advertisement -
- Advertisement -

యాటిట్యూడ్ , బిహేవియర్, కమ్యూనికేషన్ ఉండాల్సిందే:  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

మన తెలంగాణ/ హైదరాబాద్:  నగరంలో ద రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిస్టరే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొట్టమొదటి నాన్ టెక్నికల్ స్కిల్స్ కోర్స్ (నాట్స్ )ను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఆదివారం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ట్రైనీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినం, ఇక్కడ కిమ్స్ ఆస్పత్రిలో సర్జన్లకు ఎంతో ఉపయుక్తమైన కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎంఈ) కార్యక్రమం ఉన్నా ఈరోజు అంతా బిజీగా గడిచిందన్నారు. అయినా డాక్టర్ రఘురామ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. నాకు ఎంత హడావుడిగా ఉన్నా, ఈ కార్యక్రమం నా మనసుకు బాగా దగ్గరది కావడంతో కాదనలేకపోయానని పేర్కొన్నారు.

డాక్టర్ రఘురామ్ నిబద్ధత చాలా బాగుందని బ్రెస్ట్ కేన్సర్ అవగాహన గురించి ఒకసారి ఆయన నా వద్దకు వచ్చారు. రాజభవన్‌ను గులాబి రంగు లైట్లతో వెలిగించాలని ఆయన కోరారు. ఒక డాక్టర్ గా నేను అర్థం చేసుకుని, వెంటనే ఆ పని చేశాను. దేశంలో ఇలా గులాబీ రంగుతో అలంకరించిన ఏకైక రాజభవన్ మనదే. ఇది కేవలం కేన్సర్ అవగాహన కోసమే చేసినట్లు తెలిపారు. కేవలం సర్జన్లు మాత్రమే కాక థియేటర్లో ఉండే అందరికీ మనం చేసే అంశాలపై అవగాహన ఉండాలని, అందుకే ఈ కార్యక్రమం పెట్టామని డాక్టర్ బాస్కరరావు చెప్పారని వెల్లడించారు. నేను గతంలో రామచంద్ర మెడికల్ కాలేజిలో పనిచేసేటప్పుడు ఒక విఐపి చేరారని ఆయన విషయం ఏదీ బయటకు పొక్కకూడదని చాలా రహస్యంగా ఉంచారని అక్కడ అందరూ దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడారు కానీ, దురదృష్టవశాత్తు అక్కడ చేసిన ప్రొసీజర్ అంతా బయటకు వచ్చేసిందన్నారు. అక్కడ నేల తుడిచే వ్యక్తి డస్ట్ బిన్లో ఉన్న వస్తువులన్నీ చూసి, దాన్ని బట్టి ఏం చేశారో అంచనా వేసుకుని చెప్పేసిందని యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్ ఏబీసీ ఈ మూడూ చాలా ముఖ్యం.

ఒకసారి ఎమర్జెన్సీలో ఒక వ్యక్తి గుండెపోటుతో వచ్చారని ఆయనకు చికిత్స చేసి, ప్రాణాలు కాపాడి మర్నాటి ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి రౌండ్‌కు వెళ్లినప్పుడు ఎలా ఉందని అడిగితే, ఆయన ఏమాత్రం సంతృప్తి లేదన్నారు. ఎందుకని అడిగితే, ఉదయం నుంచి తాను మోషన్‌కు వెళ్లలేదని, ఎందుకిలా జరుగుతోందని అన్నారు. ప్రాణాలు కాపాడారన్న విషయం వదిలేసి, ఉదయం మోషన్ కాలేదని బాధపడుతున్నాడని.. రాత్రంతా డాక్టర్లు నిద్రపోకుండా అతడిని కాపాడినా ఆ విషయం అతడికి తెలియలేదని ఇలాంటి శిక్షణ ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా వైద్యులకు మెరుగవుతాయని పేర్కొన్నారు. మనం ఏం చేసినా పేషెంట్ల కోసమే అవుతుందని గవర్నర్ గా నేను ప్రజల కోసం చేస్తాను. వాళ్లు సంతృప్తి చెందకపోతే మనం చేసిన పనికి ఫలితం ఉండదన్నారు. విదేశాల నుంచి, దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిచోట్ల నుంచి వచ్చి ఇందులో పాల్గొన్నారు.

కిమ్స్ ఆస్పత్రి ఎప్పుడూ వైద్య అవగాహన విషయంలో ముందంజలో ఉంటుంది. డాక్టర్ రఘురామ్, ఏఎస్‌ఐని కూడా ఈ విషయంలో చాలా అభినందించాలి. దీంతో సర్జన్లతో పాటు రోగులకు, దేశానికి కూడా ఎంతగానో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక కోర్సును తెలంగాణలో నిర్వహించినందుకు మిస్ క్లోర్ మెక్ నాట్, యూకేకు చెందిన ఇతర అధ్యాపకులను అభినందిస్తున్నాను అని తమిళిపై చెప్పారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ఎండి డాక్టర్ బి. బాస్కరరావు ప్రసంగిస్తూ భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన సర్జన్లను నేను సాదరంగా స్వాగతిస్తున్నాను. కిమ్స్ ఆస్పత్రిలోనే మొట్టమొదటి నాట్స్ పరిచయ కోర్సును నిర్వహించడం మాకు గర్వంగా ఉందన్నారు. కిమ్స్ ఆస్పత్రిని ఆర్ సీఎస్‌ఎడ్ ప్రపంచపటంలో ఉంచినందుకు డాక్టర్ రఘురామ్‌కు అభినందనలు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన ఆర్సీఎస్ ఎడ్ తరపున దశాబ్ద కాలంగా కోర్సులు నిర్వహించారని, 2వేల మందికి పైగా సర్జన్లు యూకే వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎస్‌ఆర్ సీఎస్, ఎంఆర్ సీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఆ కోర్సులు దోహదపడ్డాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News