కరీంనగర్: గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణరాష్ట్రంలోనే మొట్టమొదటి మొబైల్ అనీమియా వ్యాన్ ను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గౌతమిరెడ్డి ఆదివారం కరీంనగర్ క్లబ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం లో మహిళలు అత్యధికంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో ప్రధానమైనది రక్తహీనత (అనీమియా)అని, దాని వల్ల స్త్రీలు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. రక్తహీనతతో బాధపడే మహిళలు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకొని మందులు వాడడం తప్పని సరి అవసరమన్నా రు.
గౌతమి ఫౌండేషన్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటైన ఆరంబ్‌లో భాగంగా ఆదివారం నుండి కనీసం 10,000 మంది మహిళలకు మొబైల్ అనీమియా వ్యాస్ ద్వారా అనీమియా నిర్థారణ పరీక్షలు నిర్వహించి దాని నివారణకై కృషి చేసేందుకు గౌతమి ఫౌండేషన్ పని చేస్తుందన్నారు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌతమి ఫౌండేషన్ బాధ్యులు డాక్టర్ వి రోహిత్‌రెడ్డి, కరీంనగర్ క్లబ్ కార్యదర్శి అశోక్‌రావు, ఫౌండేషన్ కో ఆర్డినేటర్ పి సురేష్‌రెడ్డి, పాల్గొన్నారు.