తెలంగాణ ప్రగతి రథచక్రాలు
మునుముందుకు దూసుకుపోతున్నాయి
ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇది అక్షర సత్యం
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు
దేశం మొత్తం కాగడా వేసి వెదికినా దళితబంధు పథకం కనపడదు
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా డబుల్ బెడ్‌రూం గృహాల నిర్మాణం
ఇది నిరంతరం ప్రక్రియ హైదరాబాద్ విశ్వనగరంగా
ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం
మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నా రు. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే వారు పరాజయం పాలుకాక తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయని.. ప్రా ణాలను తృణప్రాయంగా భావించి ఎదురొడ్డింది తెలంగాణ సమాజం పోరాడిందని ముఖ్యమం త్రి కెసిఆర్ చెప్పారు. ఆనాటి త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గు రైన తెలంగాణ ప్రాంతాన్ని సమైక్యాంధ్ర పాలకుల నుంచి విడిపించుకుని.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని అ న్నారు. ఈ మహోద్యమానికి సారథ్యం వహించడం తనకందిన మహదవకాశం అని కెసిఆర్ ఉద్ఘాటించారు. రా ష్ట్రంసాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నా రు.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం (సెప్టెంబర్ 17)పురస్కరించుకొని సిఎం కెసిఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గన్‌పార్క్‌లోని అ మరవీరుల స్తూపం వద్ద అమరుల కు పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులను అర్పిం చారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ పబ్లిక్ గా ర్డెన్స్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని ఎగరవేసారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలనుద్ధేశించి సిఎం సందేశమిచ్చారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాలను కొనసాగిస్తున్నామని కెసిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉంది
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా, రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భా రత యూనియన్‌లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్ర భుత్వం చేపట్టిందన్నారు. అందులో భాగంగా… మన హైదరాబాద్ సంస్థానం 17వ సెప్టెంబర్ 1948 నాడు సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని చెప్పా రు.ఈ పరిణామంతో.. తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని ‘తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం’గా జరుపుకోవడం తెలంగాణ ప్రభుత్వం సముచితంగా భావించిందని పేర్కొన్నా రు. అందుకే 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను ఎ గురవేసి వేడుకలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
త్యాగధనులకు వినమ్రంగా నివాళులర్పిస్తున్నా
దొడ్డి కొమురయ్య నుండి చాకలి ఐలమ్మ దాకా.. కొమురంభీం నుండి రావి నారాయణరెడ్డి దాకా, షోయబ్ ఉల్లాఖాన్ నుండి సురవరం ప్రతాపరెడ్డిదాకా, స్వామి రామానందతీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా,బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులూ త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వినమ్రంగా నివాళులర్పిస్తున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆసేతు హిమాచల పర్యం తం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సా మరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నె హ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభభా య్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల అవిరళ కృషి వల్ల దేశం ఏకీకృతమైందని చెప్పారు. నాటి జాతీయోద్య మ నాయకుల స్ఫూర్తిదాయక కృషిని సైతం ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకుందామని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకూ హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందిందని, 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ,ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేయడం, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవే అని గుర్తు చేశారు. అందుకే, ఉమ్మడి రా ష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజానీకానికీ జరిగిన తీ రని అన్యాయాలను, అక్రమాలను, సమైక్య పాలకుల ఆ ధిపత్యాన్ని ఎదిరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకో సం ఉద్యమ బావుటా ఎగురవేశామని పేర్కొన్నారు. ఆ మహోద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర తనకు అందించిన మహదవకాశమని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం మీరు నా భుజస్కంధాలపైనే మోపారని చె ప్పారు. తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించానని, ఆ తర్వాత ప్రజల అనుజ్ఞను శిరసావహిం చి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయని సిఎం కెసిఆర్ పే ర్కొన్నారు. నూతన రాష్ట్రం తె లంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని, అన్నివర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత,సమీకృత అభివృద్ధి న మూనా ఆదర్శవంతమైనదని యావద్దేశం ప్రశంసిస్తున్నదని వెల్లడించారు. భారతదే శం..విభిన్నమతాలు,సంస్కృతులు,జాతులు,భాషలు, కు లాలు, తెగల సమ్మేళనమని, భౌగోళిక ప్రత్యేకతలకు నిలయమని వ్యాఖ్యానించారు. జాతీయ సమైక్యత అనేది రా జకీయ,ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మనోవైజ్ఞానికి రంగాలకు సంబంధించిన అంశమని, జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే, వాటిలో ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలేనని స్పష్టమవుతున్నదని చెప్పారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి,తలసరి ఆదాయం పెరిగిందని కెసిఆర్ తెలిపారు. 201518 నాటికి తెలంగాణలో 13.18శాతంగా ఉన్న పేదరికం, 201921 నాటికి 5.88శాతానికి దిగివచ్చిందని చెప్పా రు.మరోవైపు, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగా ణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ని రంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్నిరంగాలనూ బలోపే తం చేయడంతో పాటు,అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగామని పేర్కొన్నారు. తె లంగాణ ఆచరిస్తున్నది…-దేశం అనుసరిస్తున్నది అన్నమా ట అక్షర సత్యం అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ అని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప థకానిది ఒక పోరాట చరిత్ర అని సిఎం కెసిఆర్ తెలిపా రు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రం కొ నసాగి ఉంటే, అప్పర్ కృష్ణా, తుంగభద్ర, భీమా ఎడమ కాలువ ద్వారా పాలమూరులోని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పా టు వల్ల ఈ అవకాశాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో అప్పట్లో వ్యవసాయ యోగ్యమైన భూమి 35 లక్షల ఎకరాలుకాగా, ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కేవలం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే అని అన్నారు. దీంతో పాలమూరు ప్రజలకు బతుకుతెరువుకోసం వలసలే గతి అయ్యాయని, 60 ఎకరాలు భూమి ఉన్న రైతు కూడా పొట్ట చేతబట్టుకొని పట్నానికి వలస వచ్చి కూలి పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే అని పేర్కొన్నారు.
మొక్కవోని పట్టుదలతో పనులు కొనసాగించాం
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రధానంగా దృష్టి సారించిందని సిఎం స్పష్టం చేశారు. పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సా గర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిందని, దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రా రంభమైందని చెప్పారు. వలస పోయినోళ్లు వాపస్ రావడమేకాదు, పాలమూరులో జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలు వలసొ చ్చే స్థాయికి పాలమూరును అభివృద్ధి చేసుకున్నామన్నా రు. దృఢ సంకల్పంతో,చిత్తశుద్ధితో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయాలని సంకల్పిస్తే, ప్రతీఘాతుక శక్తులు అడుగడుగునా అడ్డంకులు కల్పించాయని అన్నారు. స్వయానా పాలమూరు జిల్లా ప్రతిపక్ష నాయకులే కొందరు, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందలాది కేసులు పెట్టారని, అయినా మొక్కవోని పట్టుదలతో,దృఢ సంకల్పంతో పనులు కొనసాగించామని, చివరికి ధర్మమే గెలిచిందని ఉద్ఘాటించారు.
వైద్యవిద్యలో నూతన విప్లవం..
దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించిందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించడంలో, తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువచేస్తూ,వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు.
డబుల్ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ
గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానం లో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బె డ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది ప్ర భుత్వ లక్ష్యమని సిఎం స్పష్టం చేశారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వీటి నిర్మాణం కొనసాగిస్తున్నామని, ఇది నిరంతర కొనసాగే ప్రక్రియ అని తెలిపారు.
బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతి
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్ష కు గురైన బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగా ణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని సి ఎం తెలిపారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు స మాజంలోని అన్ని వర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని పేర్కొన్నారు. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం తెలంగాణ దళితబంధు అని కెసిఆర్ వెల్లడించా రు. దళిత కుటుంబం తమకు వచ్చిన, తమకు నచ్చిన వృ త్తి కానీ,వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
ఐ.టి రంగం ప్రగతి
తెలంగాణలో ఐ.టి రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నద ని సిఎం కెసిఆర్ తెలిపారు. రోజుకో కొత్త సంస్థ మన రా ష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నదని చెప్పారు.ఇవాళ ఐ.టి.రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగాఎదిగిందన్నారు.ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్,కరీంనగర్,నిజామాబాద్,మహబూబ్ నగర్,సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని ఐటి టవర్లు నిర్మించుకున్నామని తెలిపారు.
విశ్వనగరంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా అని సిఎంపేర్కొన్నారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అ న్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలసిమెలసి బతుకుతున్నారని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదు లు వేశామని తెలిపారు. మత కల్లోలాలు,గొడవలు లేకుండా ఇవా ళ హైదరాబాద్ నగరం ప్ర శాంతంగా ఉందని పేర్కొన్నా రు. పారదర్శక పరిపాలన నిరంతర విద్యుత్తూ వంటి కా రణాలతోఅనేక అంతర్జాతీయ కంపెనీలు మనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయని వివరించారు. నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా,ఎవరినోటవిన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.