Saturday, November 23, 2024

సిరాజ్ సంచలనం

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ ఫైనల్‌లో నిప్పులు చెరిగిన హైదరాబాదీ పేసర్

అత్యుత్తమ గణాంకాలు 6/21 నమోదు చేసిన మహమ్మద్ సిరాజ్
50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత జట్టు
కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన భారత జట్టు ఆతిథ్య శ్రీలంకను 50 పరుగులకే కుప్పకూల్చింది. ఇక హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లను తీసి సంచలనం సృష్టించాడు. ఓవరాల్ 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హర్దిక్ పాండ్యా 3, జస్ప్రీత్ బూమ్రా ఒక్కో వికెట్ తీశారు. దీంతో 10 వికెట్లు పేసర్ల ఖాతాలోనే పడడం విశేషం. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం సాధించి ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడింది. రోహిత్ కెప్టెన్సీలో ఇది రెండోసారి. 6/21తో వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్‌యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News