హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఎప్పుడు ప్రవేశపెడతారన్న దానిపై ఇంతవరుకూ క్లారిటీ లేదని ఎంఎల్‌సి కవిత తెలిపారు. కేబినెట్‌లో మహిళా బిల్లును ఆమోదించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఒబిసి రిజర్వేషన్ బిల్లు పెట్టాలని గతంలో సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళలకు కవిత అభినందనలు తెలిపారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, బిల్లులో పెట్టిన అంశాలపై మంత్రవర్గం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బిసి రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం చేసి పంపుతామని స్పష్టం చేశారు. పాలసీ మేకింగ్‌లో మహిళలకు సముచిత స్థానం ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ రాశారన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును బిఆర్‌ఎస్ ఆమోదిస్తుందన్నారు. ఈ బిల్లుతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతోందని, మోడీ ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, దీన్ని దాయాల్సిన అవసరంలేదని కవిత స్పష్టం చేశారు.
Also Read: విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్