- Advertisement -
ఛండీగఢ్: ఒలింపియన్ మహిళా రెజ్లర్ మార్ఫ్‌డ్ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తన కూతురు వీడియోను మార్ఫ్‌డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని జింద్ పోలీస్ స్టేషన్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి హిసార్ జిల్లాకు చెందిన అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెజ్లర్ ఫొటోను మార్ఫింగ్ చేసి 30 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎందుకు వైరల్ చేశాడో అనే విషయం ఇంకా తెలియలేదు.
Also Read: ఇషాన్ కిషాన్ కు కౌంటరిచ్చిన విరాట్..
- Advertisement -