- Advertisement -
సింగపూర్: కొవిడ్ నిబంధనలను అతిక్రమించినందుకు భారతీయ సంతతికి చెందిన ఒక సింపూర్ పౌరుడికి ఇక్కడి న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో తన ఇంటి నుంచి వెలువలకు వచ్చిన ఆ వ్యక్తి ముక్కు, నోరు కనర్ చేసే విధంగా మాస్క్ ధరించనందుకు అతనికి కోర్టు సోమవారం కారాగార శిక్ష విధించింది.
భారతీయ సంతతికి చెందిన తమిళ్‌సెల్వం రామయ్య అనే 64 ఏళ్ల వ్యక్తి మాస్కు నోటిపై లేకుండా తన సహచరుల ముఖం మీద దగ్గినందుకు అతనిపై నేరారోపణలు నమోదయ్యాయి. తనకు కొవిడ్ పాజిట్ ఉందని తెలిసినప్పటికీ తమిళ్‌సెల్వం ఈ పని చేశాడని అతినపై అభియోగాలు నమోదయ్యాయి. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మరో రెండు అభియోగాలు కూడా అతనిపై నమోదైనట్లు చానల్ న్యూస్ ఆసియా అనే పత్రిక తెలిపింది. ఈ అభియోగాలు నమోదైనపుడు తమిళ్‌సెల్వం హప్ సింగపూర్ అనే కంపెనీలో క్లినర్‌గా పనిచేసేవాడు.
- Advertisement -