Monday, November 18, 2024

నిఫా కేసుల తగ్గుదల.. ఆంక్షల సడలింపు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ కేసులు అదుపులోకి రావడంతో కొజ్‌కోడ్ జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు. ఈ మేరకు జిల్లా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాలేదు. హై రిస్క్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న 218 మంది నమూనాలను పరీక్షించగా, నెగెటివ్ లక్షణాలు కనిపించాయని రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. దీంతో జిల్లాలోని 53 వార్డులు, పంచాయతీల్లో ఆంక్షలను సడలించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. నిఫా పూర్తిగా నియంత్రణ కాకపోవడంతో కచ్చితంగా మాస్క్, సానిటైజర్లను వినియోగించాలని సూచించింది. దీంతోపాటు సామాజిక దూరం పాటించాలని ఆంక్షల్లో పేర్కొంది.

కొత్త నిబంధనలు వచ్చేంతవరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపింది. టెస్ట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. నిఫా సోకిన వారు కఠినమైన ఆంక్షలను పాటించాలని పేర్కొంది. ఆరోగ్యశాఖ సూచన మేరకు క్వారంటైన్‌లో ఉండాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆంక్షలు అమలౌతున్న వార్డుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా విద్యార్థుల ఆన్‌లైన్ తరగతులు నిర్వహణపై విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News