Sunday, November 17, 2024

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికు మరో లింక్ రోడ్డు నిర్మాణం: కమిషనర్ రోనాల్డ్‌ రోస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు మరో లింక్ రోడ్డు అందుబాటులోకి తెచ్చేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేపట్టింది. ఇందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్‌సిసి కంపెని ముందకు వచ్చింది. దీంతో దుర్గం చెరువు ప్రధాన గేట్ నుండి ఫుట్ పాత్ మీదుగా టీ.సాట్ వైపు కేబుల్ బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నన్నారు.

ఈ లింక్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మంగళవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం పూరైతే కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ రోడ్డు ద్వారా మాదాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 వైపు ప్రయాణించే వారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లవచ్చు.

ఈ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఇతరత్ర యుటిలిటి ను వెంటనే షిఫ్టింగ్ చేపట్టాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. భూసేకరణ పక్రియను పూర్తి. చేసిన వెంటనే పనులను ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఇ శంకర్ నాయక్, జోనల్ సిటీ ప్లానర్ మల్లికార్జున్, శేరిలింగంపల్లి ఏ.సి.పి మెహ్రా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News