- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను బిజెపికి చెందిన కొంతమంది ప్రయత్నిస్తున్నారని మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రజాకార్ టీజర్‌కే భయపడి నిజాం వారసులు ఏదేదో మాట్లాడుతున్నారు. ట్విట్టర్ మెన్ సెన్సార్ బోర్డ్ కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నరు.
‘బిజెపి జోకర్ కాదు.. హీరో. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాలపై మీ నాన్న మీకు చెప్పలేదా?… మీరు, మేము కలిసి రజాకార్ సినిమా చూద్దాం రండి. చిత్రం చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం చేస్తే బాగుంటుంది’ అని కెటిఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేశారు.
- Advertisement -