Saturday, December 21, 2024

ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా..
విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ప్రగతి భవన్‌లో ఘనంగా చవితి వేడుకలు జరిగాయి.

ప్రగతి భవన్ ప్రాంగణంలో ప్రతిష్టించిన మట్టి గణనాథుని విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు, వారి కుమార్తె శైలిమ పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

KTR Pragati Bhavan

Ganesh 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News