Friday, November 22, 2024

జిఎస్‌టి జగడంతో రాజ్యసభ నేటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్‌లో మంగళవారం రాజ్యసభ సమావేశాలు తొలి రోజున అధికార, విపక్ష సభ్యుల నడుమ పరస్పర వ్యాగ్యుద్ధాలతో మరుసటి రోజకు వాయిదా పడ్డాయి. సభలో ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పార్లమెంట్ ఘనత గురించి మాట్లాడారు.

తరువాత సభలో ఇరు పక్షాల సభ్యుల నడుమ విమర్శలు సాగాయి. ప్రతిపక్ష నేత ఖర్గే తమ ప్రసంగంలోనే జిఎస్‌టిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. జిఎస్‌టి చెల్లింపులలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని,ఇది సమాఖ్య వాదానికి విఘాతం అవుతుందని విమర్శించారు. దీనిపై అధికార పక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనికి ప్రతిగా ప్రతిపక్ష సభ్యులు విమర్శలకు దిగారు.ఈ దశలోనే మరుసటి రోజుకు సభ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News