Saturday, December 21, 2024

8 పట్టణాల్లో జియో ఎయిర్‌ఫైబర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గణేష్ చతుర్థి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనిమిది పట్టణాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె వంటి పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఫైబర్ కోసం రూ 1000 ఇన్‌స్టాలేషన్ చార్జీ చెల్లించాలి, 100 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫైబర్‌ను జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. కనెక్షన్‌తో పాటు కొత్త వైఫై రూటర్, టీవీ కోసం 4కె సెట్ టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌ను పొందుతారు. అన్ని ప్లాన్‌లు 6, 12 నెలల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. 12 నెలల ప్లాన్ తీసుకుంటే రూ. 1000 ఇన్‌స్టాలేషన్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. జియో 550కి పైగా డిజిటల్ చానెల్స్‌ను ఆఫర్ చేస్తోంది. నెలవారీ ప్లాన్ రూ.599 నుంచి ప్రారంభమవుతుంది.

ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
ఎయిర్ ఫైబర్ ప్రత్యేకత దాని పోర్టబిలిటీ, వినియోగదారులు ఏ ప్రదేశానికి అయినా తీసుకెళ్లి ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అయితే 5జి కనెక్టివిటీ ఉండాలి. రిలయన్స్ జియో ప్రకారం, వారి ఎయిర్ ఫైబర్ ప్రయాణంలో ఉన్నప్పుడు బ్రాడ్‌బ్యాండ్ లాంటి వేగాన్ని అందించగలదు. మారుమూల ప్రాంతాలలో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, ఇతర కంపెనీల ఆప్టిక్ వైర్ టెక్నాలజీపై ఆధారపడిన ఫైబర్ నగరాలకే పరిమితం చేశారు. అయితే ఎయిర్ ఫైబర్ ఎలాంటి వైర్ లేకుండా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అందువల్ల ఎయిర్ ఫైబర్ మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో సులభంగా అందుబాటులో ఉంటుంది.

జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మధ్య తేడా ఏమిటి?
జియో ఫైబర్ ఆప్టిక్ వైర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది. ఇది ఇల్లు, ఆఫీస్‌లో రూటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. రూటర్‌కి ఆప్టిక్ వైర్‌ని కనెక్ట్ చేస్తుంది. దీంతో ఫైబర్ స్థిరమైన హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇక ఎయిర్ ఫైబర్ అయితే వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. ఇది వైర్‌లెస్ డాంగిల్ లాగా పనిచేస్తుంది, ఇంటర్నెట్ చాలా వేగంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News