Wednesday, January 22, 2025

బొడ్డుగూడెంలో బస్సు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మోత్కూర్: యాద్రాది భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం గ్రామ శివారులో ఆర్‌టిసి బస్సు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పది మంది గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు తొర్రూరు నుండి జగదిరిగుట్ట వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు చుక్క యాకమ్మ (50), కొండ రాములు (60)గా గుర్తించారు. మృతులలో ఒక మహిళ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News