Saturday, December 21, 2024

తెలంగాణ వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గండ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లో చర్చ పెట్టాలని ఎంఎల్‌ఎ గండ్రా వెంకటరమణా రెడ్డి తెలిపారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గండ్రా మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో వలసలు పోయిన పరిస్థితి ఉండేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలోనూ పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని, కోనసీమ తలదన్నే విధంగా తెలంగాణలో పంటలు పండుతున్నాయని, పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని గండ్రా వెంకటరమణా రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గండ్రా సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, ఎంఎల్‌ఎ గండ్రా వెంకటరమణారెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

Also Read: మాస్కు లేకుండా దగ్గినందుకు రెండేళ్ల జైలు శిక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News