Saturday, December 21, 2024

కెనడాలో భారతీయులకు కేంద్రం హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడాలో భారతీయులు, ఇండియన్ స్టూడెంట్స్‌కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు, ఇండియన్ డిప్లామెట్స్, సంస్థలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కెనడా, భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడాలో పర్యటించే భారతీయులు జాగ్రత్తంగా ఉండాలని సూచించింది. అక్కడ పెరిగిపోతున్న విద్వేష నేరాలు, మత హింసపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒట్టావాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియాతో టొరంటో, వాంకోవర్ లలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం అధికారుల నుంచి సమాచారం తీసుకొవచ్చని తెలిపింది. సంబంధిత వెబ్ సైట్లలో తమ వివరాలు నమోదు చేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సంప్రదించేందుకు అవకాశం ఉంటుందని అడ్వైజరీ నోట్ లో వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News