Monday, December 23, 2024

బిజెపి మీడియా పాయింట్ తరలింపు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా పాయింట్ తరలింపునకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 29వ తేదీలోగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న మీడియా పాయింట్ ను తరలించాలని,, ఆ తర్వాత కార్యాలయంలోకి మీడియాను అనుమతించవద్దని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో కింగ్ కోఠిలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్ లోకి మీడియా పాయింట్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ఇలానే బిజెపి మీడియా పాయింట్ ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని రాష్ట్ర నాయకులు వెల్లడిస్తున్నారు. ఇది జాతీయ పార్టీ విధానమని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News